Video: చిన్నకుమారుడితో హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు చిన్నకుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు.
By Knakam Karthik
Video: చిన్నకుమారుడితో హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు చిన్నకుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లోని మార్క్ శంకర్ చదివే స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగి అతనికి గాయాలు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్‌ను హాస్పిటల్‌లో చేర్పించి కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. దీంతో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను పవన్ కళ్యాణ్ ఎత్తుకొని.. ఎయిర్ పోర్టులో కనిపించారు. అటు తన భార్య కూడా పక్కనే ఉంది.
సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన మార్క్ శంకర్ అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సుల్లో చేరాడు. అతడి కోసం లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓ వైపు పార్టీ, మరో వైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో పవన్ మాత్రం సింగపూర్ వెళ్లలేదు. అయితే ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా…సింగపూర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. అయినా కూడా గిరిజన గ్రామాల పర్యటనను ముగించుకున్న తర్వాతే తన సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారు.
అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా… అగ్ని కీలక నేపథ్యంలో ఎగసిన పొగలను పీల్చిన మార్క్… శ్వాస సంబంధిత సమస్యతో ఒకింత ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మార్క్…మొన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. ఆ తర్వాత ఓ రోజు పాటు సింగపూర్ లోనే మార్క్ కు రెస్ట్ ఇచ్చిన పవన్… శనివారం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎయిర్ పోర్టులో దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.