'వకీల్ సాబ్' సీక్వెల్ రాబోతోంది

పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా నటించిన వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 April 2023 6:15 PM IST
Pawan Kalyan, Vakeel Saab movie , Tollywood

'వకీల్ సాబ్' సీక్వెల్ రాబోతోంది 

పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా నటించిన వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. దిల్ రాజు నిర్మించిన ఈసినిమాకు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

వకీల్ సాబ్ సినిమా వచ్చి రెండేళ్లు పూర్తీ అయిన సందర్భంగా ఓ ఆసక్తికర విషయం తెలిసింది. వ‌కీల్ సాబ్ 2 సినిమా కూడా రానుంద‌ని డైరెక్ట‌ర్ శ్రీరామ్ వేణు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనే వ‌కీల్ సాబ్ 2 సినిమాను తెర‌కెక్కిస్తాన‌ని అన్నారు శ్రీరామ్ వేణు. శ్రీరామ్ వేణు ఒరిజినల్ పింక్ కు మార్పులు చేసి వ‌కీల్ సాబ్ సినిమాను తెర‌కెక్కించారు. దిల్ రాజు, శిరీష్ క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. వ‌కీల్ సాబ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా అంజ‌లి, నివేథా థామ‌స్‌, అన‌న్య నాగ‌ళ్ల త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌కాష్ రాజ్ లాయర్ నంద పాత్రలో నటించి మెప్పించారు.

Next Story