పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. ఊపిరితిత్తులలో స్వల్పంగా ఇన్ఫెక్షన్..!

Pawan Kalyan suffers mild lung infection. పవన్ కళ్యాణ్ కు ఊపిరితిత్తులలో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఏర్పడిందని అంటున్నారు.

By Medi Samrat
Published on : 16 April 2021 10:52 AM IST

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుందని కథనాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు ఊపిరితిత్తులలో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఏర్పడిందని అంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ టెస్టులు చేయించుకున్నారని.. చేసిన పరీక్షల్లో కొద్దిపాటి ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్లు తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు.



పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉన్న వారిలో కొందరికి ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కూడా క్వారంటైన్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆయన హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన ఆస్పత్రికి టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు బయటపడినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, తిరుపతి లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పాదయాత్ర వంటి వాటిలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకిన కారణంగా ఆయన ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ హెల్త్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Next Story