యాక్షన్ కు రెఢీ అవుతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan Ready to Shoot For Harihara Veeramallu. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అసలు ఊహించని రీతిలో క్రిష్ జాగర్లమూడి 'హరహర వీరమల్లు' గా చూపించబోతూ ఉన్నారు.

By Medi Samrat
Published on : 2 April 2021 6:17 PM IST

Harihara Veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ రూపంలో త్వరలోనే సినిమా రాబోతూ ఉంటే.. ఇక ఆయన్ను అసలు ఊహించని రీతిలో క్రిష్ జాగర్లమూడి 'హరహర వీరమల్లు' గా చూపించబోతూ ఉన్నారు. ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. పవన్ కళ్యాణ్ ను హిస్టారికల్ బ్యాగ్డ్రాప్ లో చూడాలని అనుకున్న అభిమానులకు ఫుల్ మీల్స్ రెఢీ అవుతోంది. తాజాగా యాక్షన్ సీన్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్.

'హరిహర వీరమల్లు' చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫైటింగ్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు. పవన్ సాధన చేస్తున్నారు. స్టంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ పర్యవేక్షణలో హర్ష్ వర్మ అనే షావోలిన్ యోధుడితో కలిసి బల్లెం ఉపయోగించి పోరాడడంపై శిక్షణ పొందుతున్నారు. సెట్స్ పైకి చాలా త్వరగా చేరుకునే పవన్ మేకప్ కంటే ముందే ఉదయం 7 గంటల నుంచి ఈ తరహా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్ లను కూడా నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 17వ శతాబ్దం నాటి ఇతివృత్తంతో రాబోతోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానుంది.




Next Story