పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. సుజీత్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తోన్న 'ఓజీ' మూవీపై మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న వారి కోసం చిత్ర బృందం క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'ఫైరింగ్ వరల్డ్ 25 సెప్టెంబరు 25' అని పేర్కొంది.
కాగా పవన్ కల్యాణ్ ఇప్పటికే ఒప్పుకొన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా 'హరి హర వీరమల్లు' షూటింగ్ పూర్తి చేసి, 'ఓజీ' కోసం రంగంలోకి దిగారు. ఇటీవల షూటింగ్ మళ్లీ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం కూడా ప్రకటించింది. వీలైనంత త్వరగా ఈ మూవీని పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ భావిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మూవీ అంచనాలను పెంచింది.