‘ఓజీ’ సెట్స్‌లో ప‌వ‌న్‌.. హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

Pawan Kalyan OG Movie Heroine. పవన్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై

By M.S.R  Published on  19 April 2023 6:30 PM IST
‘ఓజీ’ సెట్స్‌లో ప‌వ‌న్‌.. హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

పవన్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్‌ కళ్యాణ్ గ్యాంగ్‌స్టార్‌ పాత్ర చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో ప్రారంభమైంది. సినిమా షూట్‌లో పవన్‌ కూడా చేరిపోయారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రియాంక ఈ సినిమాలో నటిస్తుందని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. గ్యాంగ్‌లీడర్‌, శ్రీకారం, డాక్టర్‌, డాన్‌ వంటి సినిమాలతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఇప్పుడు పవన్‌కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్‌ 60 రోజుల కాల్షీట్లు ఇచ్చారు. ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయనున్నారు.

ముంబైలోని OG సెట్స్‌కి పవన్ కళ్యాణ్ ఆల్ బ్లాక్ లుక్‌లో వెళ్లారు. OG సెట్స్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయిన విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో పవన్ కళ్యాణ్ సెట్స్‌కి వస్తున్న ఫొటోను జత చేసింది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ బ్లాక్ షేడ్స్ పెట్టుకుని బ్లాక్ హుడీ, బ్లాక్ కార్గో ప్యాంట్ ధరించి కనిపించారు.


Next Story