పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ 'హరిహరవీరమల్లు'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడి పాత్రలో పవన్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ట్రైలర్‌లోని భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఈ సినిమాను మొదట క్రిష్ ప్రారంభించారు . పలు కారణాల వల్ల ఆయన తప్పుకోగా, జ్యోతి కృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. పవన్ ఇందులో యోధుడి పాత్రలో నటించారు. హిస్టారికల్ యాక్షన్‌గా ఈ సినిమా సిద్ధమయ్యింది. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో కథ సాగుతుంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, కీరవాణి మ్యూజిక్ అందించారు. కాగా, దీనిని రెండు భాగాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగం 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో రానుంది. జ్ఞాన శేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస సినిమ్యాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.