ఓజీ డైరెక్టర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పవన్‌కల్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఓజీ సినిమా దర్శకుడు సుజీత్‌కు అదిరిపోయే బహుమతిని అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

By -  Knakam Karthik
Published on : 16 Dec 2025 2:53 PM IST

Cinema News, Tollywood, Entertainment, Pawan Kalyan, OG movie, director Sujeeth

ఓజీ డైరెక్టర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పవన్‌కల్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఓజీ సినిమా దర్శకుడు సుజీత్‌కు అదిరిపోయే బహుమతిని అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజైన ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుజీత్‌కు పవన్ కల్యాణ్ ఓ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని దర్శకుడు సుజీత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా స్వయంగా పంచుకున్నారు. పవన్ కల్యాణ్ అందించిన బహుమతి పట్ల తన సంతోషాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశారు.

"నేను అందుకున్న బహుమతుల్లో ఇది అత్యుత్తమమైన‌ది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా, కృతజ్ఞతతో నిండిపోయాను. నా అత్యంత ప్రియమైన ఓజీ, కల్యాణ్ గారి నుంచి లభించిన ఈ ప్రేమ, ప్రోత్సాహం నాకు అన్నిటికంటే ముఖ్యం. చిన్ననాటి నుంచి ఆయన అభిమానిగా మొదలై ఈ ప్రత్యేక క్షణం వరకు… ఇది నిజంగా అద్భుతం. జీవితంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను" అంటూ సుజీత్ పోస్ట్ చేశారు.

Next Story