ఆయన తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తూనే ఉంటా..పవన్ ఎమోషనల్ పోస్ట్

యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి ఘన సత్కారంపై ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు

By Knakam Karthik
Published on : 20 March 2025 10:50 AM IST

Cinema News, Pawan Kalyan, Tollywood, Entertainment, Megastar Chiranjeevi, Lifetime Achievement Award, UK Parliament

ఆయన తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తూనే ఉంటా..పవన్ ఎమోషనల్ పోస్ట్

యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి ఘన సత్కారంపై ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.'సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను'.

యూకే పార్లమెంట్ చిరంజీవి గారికి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..అని పవన్ కల్యాణ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story