'బ్రో' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా 'బ్రో'. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి.
By అంజి Published on 18 July 2023 9:18 AM IST'బ్రో' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా 'బ్రో'. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలిసింది. మేకర్స్ 'బ్రో' సినిమా రన్‌టైమ్‌ని 2 గంటల 15 నిమిషాలు ఫిక్స్ చేసినట్టు సమాచారం. జూలై 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓకే స్క్రీన్‌పై మెగా కాంపౌండ్ హీరోలు కనిపించనుండటంతో భారీ బజ్ ఏర్పడింది.
సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సిత్తం' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆడియెన్స్ నుంచి అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అప్‌డేట్‌ని మేకర్స్ రివీల్ చేశారు. ట్రైలర్ అప్‌డేట్ రావడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూలై 21వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాత వివేక్ కూచిబొట్ల వెల్లడించారు. మరోవైపు ప్రీ రిలీజ్ వేడుకపై సినిమా మేకర్స్ తర్జన భర్జన పడుతున్నారు.
మొదట జూలై 24వ తేదీన ప్రీ రిలీజ్ చేయాలనుకున్నా.. పవన్ ఏపీలో తన పొలిటికల్ పర్యటనలో బిజీగా ఉండటంతో మేకర్స్ డేట్ ఫిక్స్ చేయలేకపోతున్నారు. దీనిపై మరో రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. దర్శకుడు త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గ పలు మార్పు చేయగా.. ఎస్‌ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు. పీపుల్ మీడియా బ్యానర్స్‌పై ఈ సినిమాను నిర్మించారు. అంతర్గతంగా ఈ సినిమా బిజినెస్ భారీ రేంజ్‌లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.