'ఉస్తాద్ భగత్‌సింగ్' గా పవన్.. అదిరిపోయిన పవర్‌స్టార్ లుక్
Pawan Kalyan as Ustaad Bhagat Singh.పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాల్లో నటిస్తూ పుల్ బిజీగా ఉన్నారు
By తోట వంశీ కుమార్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాల్లో నటిస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ఆయన హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
'మనల్ని ఎవడ్రా ఆపేది' అన్నది ట్యాగ్ లైన్. ఈ సారి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు అంటూ మూవీ థీమ్‌లైన్ కూడా ఇచ్చారు. ఇక ఈ కొత్త పోస్టర్ పవన్ ఓ చేత్తో హార్లీ డేవిడ్సన్ బైక్‌ను.. మరోచేతిలో టీ గ్లాస్ పట్టుకుని గంభీరంగా కనిపిస్తున్నాడు. పవన్‌ని ఇలా చూసి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan in and as #UstaadBhagatSingh 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2022
This time, it's beyond entertainment 😎🔥
Shoot begins soon 💥❤️🔥@harish2you @ThisIsDSP @DoP_Bose @MythriOfficial pic.twitter.com/F7EFDOW3F8
ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు మేకర్స్ చెప్పేశారు. కాగా.. ఈ చిత్రం తమిళ చిత్రం 'తెరి' రీమేక్ అనే ప్రచారం సాగుతోంది. అయితే ఇది తెరి రీమేకా లేక కొత్త కథా అన్నది తెలియాల్సి ఉంది.