ఐసీయూలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ భర్త

నటుడు పర్విన్ దబాస్ సెప్టెంబర్ 21, శనివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు.

By Medi Samrat  Published on  21 Sept 2024 12:27 PM IST
ఐసీయూలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ భర్త

నటుడు పర్విన్ దబాస్ సెప్టెంబర్ 21, శనివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు బాంద్రాలోని ప్రైవేట్ ఆసుపత్రి ICUలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం ముంబైలో జరిగిన కారు ప్రమాదంలో పర్విన్ దబాస్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో పర్విన్ దబాస్ స్వయంగా కారు నడుపుతున్నాడు. 50 ఏళ్ల నటుడు, దర్శకుడు ముంబైలోని బాంద్రాలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పర్విన్ దాబాస్ పరిస్థితి చాలా విషమంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పర్విన్ భార్య ప్రీతి ఝాంగియాని ప్రస్తుతం అతనితో పాటు ఆసుపత్రిలో ఉన్నారు. ప్రీతి ఝాంగియాని తెలుగులో తమ్ముడు సినిమాతో పాటూ మరి కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.

ప్రీతి ఝాంగియాని ఈ ప్రమాదంపై స్పందించారు. "నేను, నా కుటుంబం ప్రస్తుతం షాక్‌లో ఉన్నాము. మాట్లాడలేకపోతున్నాము. పర్విన్ దబాస్ కు తీవ్రమైన కంకషన్ ఉంది. వైద్యులు CT స్కాన్లు, ఇతర పరీక్షలు చేస్తున్నారు. తెల్లవారుజామున డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు." అంటూ ఒక ప్రకటన వచ్చింది. ప్రీతీ ఝాంగియాని ఆదిత్య చోప్రా చిత్రం 'మొహబ్బతే' (2008)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం లో ప్రవీణ్‌ని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Next Story