రాయల్ మ్యారేజ్.. ఘనంగా రాఘవ్-పరిణీతిల పెళ్లి వేడుక
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా ఈరోజు వివాహ వేడుక ద్వారా ఒక్కటవనున్నారు.
By Medi Samrat Published on 24 Sep 2023 10:38 AM GMTబాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా ఈరోజు వివాహ వేడుక ద్వారా ఒక్కటవనున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సేరాబంధి కార్యక్రమం నిర్వహించారు. పరిణీతి చూడా వేడుక లీలా ప్యాలెస్‌లో ఏకకాలంలో జరిగింది. వరుడు రాఘవ్‌తో కలిసి బంధుగణం 18 పడవల్లో వధువు పరిణీతిని తీసుకురావడానికి బయలుదేరారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఊరేగింపు హోటల్ లీలా ప్యాలెస్ కు చేరుకుంది. పడవ అలంకరణ మేవార్ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. 4 గంటలకు ఫెరాస్ (వివాహ ప్రమాణాలు) జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం లీలా ప్యాలెస్‌లో గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతుంది.
ఆదివారం ఉదయం నుంచి వివాహానికి హాజరయ్యేందుకు అతిథుల రాక మొదలయ్యింది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆదిత్య ఠాక్రే రాజ వివాహానికి హాజరయ్యేందుకు ఉదయపూర్ చేరుకున్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ నిన్ననే ఉదయపూర్ చేరుకున్నారు.
అంతకుముందు శనివారం రాత్రి జరిగిన సంగీల్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ వేడుకలో నటి పరిణీతి చోప్రా సిల్వర్ కలర్ గౌను, రాఘవ్ బ్లాక్ సూట్ ధరించారు. ఈ వేడుకకు పంజాబ్ నుండి ధోల్ కళాకారులను పిలిచారు. పరిణీతి, రాఘవ్‌లతో పాటు వారి స్నేహితులు కూడా సంగీత్ వేడుకలో జోరుగా డ్యాన్స్ చేశారు.