మరోసారి ఆసుపత్రి పాలైన పంచ్ ప్రసాద్

Panch Prasad was hospitalized once again. పంచ్ ప్రసాద్.. జబర్ధస్త్ చూసే ప్రేక్ష‌కుల‌కు ప్ర‌తీ ఒక్కరికీ తెలిసిన పేరు. అయితే అతడిని అనారోగ్యం వెంటాడుతూ ఉంది.

By M.S.R
Published on : 8 April 2023 4:24 PM IST

మరోసారి ఆసుపత్రి పాలైన పంచ్ ప్రసాద్

Panch Prasad


పంచ్ ప్రసాద్.. జబర్ధస్త్ చూసే ప్రేక్ష‌కుల‌కు ప్ర‌తీ ఒక్కరికీ తెలిసిన పేరు. అయితే అతడిని అనారోగ్యం వెంటాడుతూ ఉంది. కొద్దిరోజుల పాటూ ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రసాద్.. ఈ మధ్య మళ్లీ షోలలో అలరించడం మొదలుపెట్టాడు. తాజాగా మరోసారి పంచ్ ప్రసాద్ ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవలే తీవ్రమైన జ్వరం రావడంతో.. మరోసారి ఆస్పత్రిలో చేరారు కమెడియన్. నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం పంచ్ ప్రసాద్ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆయన చేతులకే దాదాపు 50 ఇంజెక్షన్స్ చేశారని పంచ్ ప్రసాద్ సతీమణి తెలిపారు. చికిత్స తర్వాత తీవ్రమైన నొప్పి ఉంటోందని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నడవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య తెలిపారు. పంచ్ ప్రసాద్ అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మెరుగు పడాలని, బుల్లితెరపై అందరినీ అలరించాలని ఆకాంక్షిస్తూ వస్తున్నారు.


Next Story