భారత్‌ను ఓడిస్తే జింబాబ్వే వ్యక్తిని పెళ్లిచేసుకుంటా : పాక్ నటి
Pakistani actor says 'Will Marry Zimbabwean Guy' if they win team India in T20 WC.నటి సెహర్ షిన్వారీ మరోసారి భారత్‌పై
By తోట వంశీ కుమార్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో ఆదివారం భారత జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమ్ఇండియా ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా సెమీస్‌కు చేరనుంది.
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌కు చెందిన నటి సెహర్ షిన్వారీ మరోసారి భారత్‌పై తన అక్కసును వెల్లగక్కింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడి పోవాలని ట్వీట్ చేసింది. అంతేనా.. ఓ బంఫర్ ఆఫర్ కూడా ఇచ్చిందండోయ్.. ఒకవేళ జింబాబ్వే జట్టు భారత్ పై ఘన విజయం సాధిస్తే తాను ఆ దేశస్తుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
"భారత జట్టుపై జింబాబ్వే ఘన విజయం సాధిస్తే.. నేను ఆదేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను." అని సెహర్ షిన్వారీ ట్వీట్ చేసింది.
I'll marry a Zimbabwean guy, if their team miraculously beats India in next match 🙂
— Sehar Shinwari (@SeharShinwari) November 3, 2022
కాగా.. ఈ నటి ఇండియాపై ఇలా అక్కసు వెల్లగక్కడం ఇదే తొలిసారి కాదు. భారత్-బంగ్లా దేశ్ మ్యాచ్ సందర్భంగా టీమ్ఇండియా ఓడిపోవాలని కోరుకుంటూ పదే పదే ట్వీట్ చేసింది. అంతక ముందు స్వదేశంలో టీమ్ఇండియా టీ20 సిరీస్‌లో భాగంగా ఆసీస్ చేతిలో ఓడి పోయినప్పుడు కూడా భారత జట్టుపై విమర్శలు గుప్పించింది.
ప్రస్తుతం షిన్వారీ ట్వీట్ వైరల్‌గా మారింది. భారత అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు షిన్యారీని ట్రోల్ చేస్తున్నారు. ఇక మీ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండాల్సి వస్తుందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. జింబాబ్వేను భారత్ ఓడిస్తే మీ ట్వీట్టర్ ఖాతాను డిలీట్ చేయాలని ఇంకొకరు అన్నారు.
కాగా.. ఇదే ప్రపంచకప్‌లో జింబాబ్వే జట్టు పాకిస్తాన్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.