ఓటీటీలో విడుదల కాబోతున్న భారీ చిత్రాలు ఇవే..!

OTT Streaming Movies in July Month. ఈ నెలలో థియేటర్లలో విడుదలైన సినిమాలలో ఎక్కువ భాగం బాక్సాఫీస్

By Medi Samrat  Published on  25 Jun 2022 11:36 AM GMT
ఓటీటీలో విడుదల కాబోతున్న భారీ చిత్రాలు ఇవే..!

ఈ నెలలో థియేటర్లలో విడుదలైన సినిమాలలో ఎక్కువ భాగం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ప్రేక్షకులు ఈ చిత్రాలను థియేటర్లలో చూసి ఆనందించారు. ఇప్పుడు, వారు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎప్పుడు వస్తాయా అని చూడడానికి వేచి ఉన్నారు. ఓటీటీ రిలీజ్ జరిగితే తమ కుటుంబాలతో కలిసి వాటిని మళ్లీ చూడవచ్చు. బ్లాక్ బస్టర్ సినిమాలకు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్స్ ఇక్కడ ఉన్నాయి.

మేజర్

అడివి శేష్, శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ మరియు రేవతి నటించిన 'మేజర్' ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. జూలై 1 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది.

విక్రమ్

ఈ సినిమా తమిళనాడులో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. కమల్ హాసన్ నాలుగు సంవత్సరాల తర్వాత 'విక్రమ్'తో థియేటర్లలోకి వచ్చాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ మరియు సూర్య కూడా నటించారు. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది. 'విక్రమ్' జూలై 8 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది.

అంటే సుందరానికి

నాని, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. బ్రాహ్మణ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయిల ప్రేమకథ ఇది. ఈ సినిమా చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ప్రశంసలు అందుకుంది. ఇది జూలై 8 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది.

విరాట పర్వం

వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన 'విరాట పర్వం' నక్సలిజం, కవిత్వం, సాహిత్యం మరియు ప్రేమ కు సంబంధించినది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి, జరీనా వాహిబ్, ఈశ్వరీ రావు, ప్రియమణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను పొందింది. 'విరాట పర్వం' జూలై 15 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.Next Story
Share it