2022 జరిగే ఆస్కార్ బరిలో భారత్ నుండి తమిళ్ మూవీ 'కూళంగల్' నిలవనుండి. ఈ విషయాన్ని ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఛైర్ పర్సన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు. 2022లో 94వ ఆస్కార్ అవార్డులు అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బి థియెటర్‌లో జరగనున్నాయి. ఈ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేశామని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ సుప్రాన్ సెన్ తెలిపారు. కూళంగల్ మూవీని ప్రముఖ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ సంయుక్తంగా నిర్మించారు.
ఆస్కార్ పోటీల్లో 'కూళంగల్' మూవీ నిలిచిందన్న విషయం తెలుసుకున్న విఘ్నేష్.. ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్ గెలిచేందుకు కేవలం రెండు మెట్ల దూరంలో ఉన్నాన, ఒక నిర్మాతగా మంచి కథను చూపించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు. ఈ సినిమాను డైరెక్టర్ పీఎస్ వినోద్ కుమార్ తన ఫ్యామిలీలో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తీశారు. ఈ సినిమా పీఎస్ వినోద్ కుమార్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా. 'కూళంగల్' ఇది ఒక తండ్రి కొడుకుల కథ. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.