ఆ రెండు హాలీవుడ్ సినిమాలకు భారత్ లో బంపర్ ఓపెనింగ్స్

Oppenheimer and Barbie open with excellent numbers in India. ఈ వారం హాలీవుడ్ సినిమాల సందడి బాక్సాఫీస్ వద్ద బాగా కనిపిస్తోంది.

By Medi Samrat  Published on  22 July 2023 9:08 PM IST
ఆ రెండు హాలీవుడ్ సినిమాలకు భారత్ లో బంపర్ ఓపెనింగ్స్

ఈ వారం హాలీవుడ్ సినిమాల సందడి బాక్సాఫీస్ వద్ద బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో హాలీవుడ్ సినిమాలకు సినీ అభిమానులు క్యూ కట్టారు. విభిన్నమైన జానర్‌లకు చెందిన రెండు హాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ప్రముఖ చిత్రనిర్మాత క్రిస్టోఫర్ నోలన్ 'ఒపెన్‌హైమర్', మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన 'బార్బీ' ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించాయి. ఈ రెండూ భారతదేశంలో అద్భుతమైన ఓపెనింగ్స్ తో మొదలయ్యాయి.

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్‌హైమర్‌ కు భారత్ లో మొదటి రోజు రూ. 14.5 కోట్ల వసూళ్లు వచ్చాయి. కలెక్షన్స్ పరంగా ఒపెన్‌హైమర్ భారతదేశంలో అగ్రగామిగా ఉండగా, యునైటెడ్ స్టేట్స్‌లో బార్బీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుంది. బార్బీ ఇప్పటికే USలో $22.3 మిలియన్లను సంపాదించింది, Oppenheimer $10.5 మిలియన్లను వసూలు చేసింది.

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. నోలన్ తీసిన సినిమాలన్నీ భారత్ లో కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఆయన తెరకెక్కించిన సినిమా ఓపెన్‌హైమర్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్. భౌతిక శాస్త్రవేత్త J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితాన్ని ఈ చిత్రం వివరిస్తుంది. ఇక బార్బీ సినిమా బార్బీ బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందా అని చూపించారు. పిల్లలు ఉన్న ప్రతి ఇంటి లోనూ బార్బీ బొమ్మలు ఉంటాయి. అందుకే ఈ సినిమాకు కూడా మంచి పాపులారిటీ దక్కింది.


Next Story