ఆర్జీవీకి మరోసారి నోటీసులు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదయింది.
By Medi Samrat Published on 20 Nov 2024 3:45 PM GMTప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదయింది. అయితే ఈ కేసులో నవంబర్ 19న విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆయన హాజరవ్వలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల విచారణకు రాలేనని ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్‌లో సంప్రదించారు వర్మ. విచారణకు సహకరిస్తానని చెప్పిన వర్మ పోలీసులను వారం రోజుల గడువు కోరారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వర్మ. ఈ పిటిషన్‌పై సోమవారం రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది