ఏజెంట్ సినిమా విడుదలై ఏడాది.. అక్కినేని హీరో ఎక్కడ?

టాలీవుడ్ యంగ్ హీరోలలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. ఎంతో గ్రాండ్ గా 'అఖిల్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

By Medi Samrat  Published on  1 May 2024 11:52 AM IST
ఏజెంట్ సినిమా విడుదలై ఏడాది.. అక్కినేని హీరో ఎక్కడ?

టాలీవుడ్ యంగ్ హీరోలలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. ఎంతో గ్రాండ్ గా 'అఖిల్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా అఖిల్ కు సక్సెస్ ను అందించలేదు. ఇక ముఖ్యంగా అఖిల్ చేసిన 'Hello' సినిమాకు అనుకున్న పేరు రాలేదు. ఇక ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ ను అందుకున్నాడు. ఓ పెద్ద చేంజ్ ఓవర్ తో అఖిల్ 'ఏజెంట్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా అనుకున్నంత సక్సెస్ ను ఆ సినిమా దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత అఖిల్ ఏ సినిమా చేస్తున్నాడో కూడా క్లారిటీ లేకుండా పోయింది. చిత్ర పరిశ్రమలో జయాపజయాలు సర్వ సాధారణమే.. ఎంతో మంది ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించామని చెబుతూ ఉంటారు. కానీ అనుకున్నంత ఇంపాక్ట్ ఆ సినిమాలు క్రియేట్ చేయలేకపోయాయి. అలాగని సైలెంట్ గా ఉండిపోతే ఎలా అని సినీ అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా అఖిల్ మంచితనంతో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాంటి హీరో ఏడాది నుండి సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదని చాలా మంది వాదన.

అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో రూపొందించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఏజెంట్ ఫెయిల్యూర్ తర్వాత, అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే అఖిల్ ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్‌లకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. అఖిల్ బ్లాక్ బస్టర్ సినిమా 'విరూపాక్ష' సీక్వెల్‌లో కూడా నటించడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఏది ఏమైనా అఖిల్ వరుసగా సినిమా తీయాలని అక్కినేని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.

Next Story