ఆ రెండు సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి

లాజిక్ లేని కామెడీ సినిమాను చూడాలని అనుకుంటే ఇప్పుడు ఓటీటీలోకి 'ఓం భీమ్ బుష్' సినిమా వచ్చేసింది.

By Medi Samrat  Published on  11 April 2024 9:47 PM IST
ఆ రెండు సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి

లాజిక్ లేని కామెడీ సినిమాను చూడాలని అనుకుంటే ఇప్పుడు ఓటీటీలోకి 'ఓం భీమ్ బుష్' సినిమా వచ్చేసింది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన.. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్. ఓం భీమ్ బుష్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. నిధి కోసం ఒక గ్రామానికి వచ్చిన ముగ్గురు శాస్త్రవేత్తల కథనే ఈ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఓం భీమ్ బుష్ UV క్రియేషన్స్ అనుబంధ సంస్థ V సెల్యులాయిడ్ నిర్మించింది.

విశ్వక్ సేన్ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ గామి (2024) బాక్సాఫీసు దగ్గర మంచి ఓపెనింగ్ లభించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. టెక్నీకల్ గా ఈ సినిమా బ్రిలియంట్ అని పలువురు ప్రశంసించారు. కొత్త తరహా సినిమాలు చూడాలని అనుకునే వాళ్లకు ఈ సినిమా మంచి ఛాయిస్. గామి సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషలలో Zee5లో ఏప్రిల్ 12, 2024 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. నూతన దర్శకుడు విద్యాధర్ కగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది.

Next Story