అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకుపోతున్న‌ ఎన్టీఆర్ 'దేవ‌ర‌'

అడ్వాన్స్ బుకింగ్ అనేది బాక్సాఫీస్ వద్ద సినిమాకు వసూళ్ల పరంగా చాలా వరకు సహాయపడుతుంది.

By Medi Samrat  Published on  17 Sept 2024 5:54 PM IST
అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకుపోతున్న‌ ఎన్టీఆర్ దేవ‌ర‌

అడ్వాన్స్ బుకింగ్ అనేది బాక్సాఫీస్ వద్ద సినిమాకు వసూళ్ల పరంగా చాలా వరకు సహాయపడుతుంది. భారతదేశంలో సినిమా విడుదలకు ఒక వారం ముందు టిక్కెట్ విండో తెరవబడుతుంది. కానీ విదేశాలలో ఇది చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. ప్రస్తుతం తెలుగు సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ పరంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పటివరకు ఎన్ని దేవర టిక్కెట్లు అమ్ముడయ్యాయో తెలుసుకుందాం.

సుదీర్ఘ విరామం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో సినిమాతో రాబోతున్నాడు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద హిట్ ఇచ్చాడు. దేవర ట్రైలర్ చూశాక అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. యూఎస్‌ఏలో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది, ఆ క్రేజ్‌ సినిమా అడ్వాన్స్ బుకింగ్ తో స్పష్టమైంది.

కోయి-మోయి నివేదిక ఆధారంగా.. ఇప్పటివరకూ USAలో దాదాపు 46,000 దేవర టిక్కెట్లు ముందస్తు బుకింగ్‌లో అమ్ముడయ్యాయి. ఇప్ప‌టికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1.35 మిలియన్లు వ‌సూలు చేసింది. అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.11 కోట్లు. ఏ సినిమాకైనా విడుదలకు 10 రోజుల ముందు ఇంత పెద్ద సంఖ్యలో టిక్కెట్లు బుక్ చేసుకోవడం వసూళ్ల పరంగా సునామీకి స్పష్టమైన సంకేతంగా చెబుతున్నారు.

రానున్న రోజుల్లో బుకింగ్ సంఖ్య మరింత పెరగనుంది. ఈ లెక్కలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కి అమెరికాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఈజీగా ఊహించవచ్చు. దేవర సెప్టెంబర్ 27న వెండి తెరపై విడుదల కాబోతోంది.

Next Story