మావయ్యకి శుభాకాంక్ష‌లు.. చంద్ర‌బాబుకు ఎన్టీఆర్ విషెస్‌.. హోరెత్తుతున్న సోష‌ల్ మీడియా

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ ఏపీ ఎన్నిక‌ల‌లో విజ‌యంపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత, త‌న బంధువు అయిన చంద్ర‌బాబుకు, కుటుంబ స‌భ్యుల‌కు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపారు.

By Medi Samrat  Published on  5 Jun 2024 3:29 PM IST
మావయ్యకి శుభాకాంక్ష‌లు.. చంద్ర‌బాబుకు ఎన్టీఆర్ విషెస్‌.. హోరెత్తుతున్న సోష‌ల్ మీడియా

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ ఏపీ ఎన్నిక‌ల‌లో టీడీపీ విజ‌యంపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత, త‌న బంధువు అయిన చంద్ర‌బాబుకు, కుటుంబ స‌భ్యుల‌తో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎన్టీఆర్ త‌న ఎక్స్‌లో.. ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు అని పోస్టులో రాశారు.

అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన @PawanKalyan గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మ‌రో ట్వీట్ కూడా చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అస‌లే భారీ విజ‌యంతో సంబ‌రాలు చేసుకుంటున్న టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోడ‌వ‌డంతో సోష‌ల్ మీడియా లైక్స్, షేర్స్ తో హోరెత్తుతుంది.

Next Story