తీవ్ర భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్

NTR Mmotional about Puneeth Rajkumar Death. గుండెపోటుతో మరణించిన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని జూనియర్

By Medi Samrat  Published on  30 Oct 2021 3:52 PM IST
తీవ్ర భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్

గుండెపోటుతో మరణించిన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ దర్శించుకున్నారు. తన మిత్రుడు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. పునీత్ భౌతిక కాయాన్ని చూసి ఎన్టీఆర్ భావోద్వేగాలకు గురయ్యారు. ఎన్టీఆర్ కు, పునీత్ కు అనుబంధం ఉంది. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలో 'గెళయా గెళయా' అనే పాటను ఎన్టీఆర్ పాడడం విశేషం. పునీత్, ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. పునీత్ నిన్న హఠాన్మరణం చెందారన్న వార్తను ఎన్టీఆర్ నమ్మలేకపోయానని.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎన్టీఆర్ పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ను హత్తుకుని ఓదార్చారు. ఎన్టీఆర్ ను చూడగానే శివరాజ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.

పునీత్ రాజ్ కుమార్ కు తెలుగు చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబంతో రాజ్ కుమార్ కుటుంబానికి ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. గతంలో పలు ఈవెంట్లలో బాలకృష్ణతో కలిసి పునీత్ రాజ్ కుమార్ కనిపించారు. పునీత్ మరణ వార్త తనను కలచివేసిందని బాలకృష్ణ సోషల్ మీడియాలో తెలిపారు. ఈరోజు బెంగళూరుకు వెళ్లారు బాలకృష్ణ. కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాన్ని దర్శించుకున్నారు. పునీత్ భౌతికకాయాన్ని చూసిన వెంటనే బాలయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు.


Next Story