యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోల మార్ఫింగ్.. సీపీ సజ్జనార్‌కు ఫ్యాన్స్ ఫిర్యాదు.!

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

By -  Medi Samrat
Published on : 23 Oct 2025 7:11 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోల మార్ఫింగ్.. సీపీ సజ్జనార్‌కు ఫ్యాన్స్ ఫిర్యాదు.!

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఎన్టీఆర్ అభిమానులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు.

తమ అభిమాన హీరో ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర రీతిలో ట్రోల్స్, మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వ్యక్తులపై, ఆ హ్యాండిల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉన్న కంటెంట్‌ను తక్షణమే ఆయా ప్లాట్‌ఫామ్స్ నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెలబ్రిటీలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్న వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు.

Next Story