ఆ హాట్ బ్యూటీని తిడుతున్న నెటిజన్లు

Nora Fatehi Trolled For Making A Guard Hold Her Saree. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీకి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంటుంది.

By Medi Samrat  Published on  6 July 2022 8:45 PM IST
ఆ హాట్ బ్యూటీని తిడుతున్న నెటిజన్లు

బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీకి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోపక్క బాలీవుడ్ డ్యాన్స్ రియాలిటీ షో 'డ్యాన్స్ దీవానే జూనియర్స్'కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో షూటింగ్‌లో పాల్గొనటానికి సెట్స్‌కు వెళ్తున్న సమయంలో ఫతేహీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్‌లో పాల్గొనటానికి చీర కట్టుకొని వెళ్తుండగా వర్షం పడింది. ఈ సమయంలో చీర తడవకుండా తన బాడీగార్డ్ సాయం తీసుకుంది నోరా. కారులోంచి దిగి క్యారవాన్ వరకు వెళ్లేంతవరకు ఆమె బాడీగార్డ్ నీటిలో చీర తడవకుండా చీరను పట్టుకొని వెనకాలే వర్షంలో నడిచాడు. దాంతో ఆ వీడియోను చూసిన నెటిజన్స్ నోరాను తిట్టడం మొదలుపెట్టారు. వెనకాల నీ చీర పట్టుకొని నడవాలా నువ్వేమన్నా మహారాణివా అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.

ఇందుకు సంబంధించి నోరా ఫతేహికి చెందిన అనేక వీడియోలు, ఫోటోలు వెబ్‌లో వైరల్ అయ్యాయి. వ్యానిటీ వ్యాన్‌ను చేరుకోవడానికి ఆమె తన సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకోవడాన్ని నెటిజన్లు అసలు ఇష్టపడడం లేదు. డ్యాన్స్ దీవానే జూనియర్స్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ లో షంషేరా తారాగణం రణబీర్ కపూర్, వాణి కపూర్‌లు అలరించనున్నారు. ఈ షోకు కరణ్ కుంద్రా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వర్క్ పరంగా నోరా ఫతేహి చివరిసారిగా భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపించింది.










Next Story