నోరా ఫతేహికి అలాంటి సలహా ఇచ్చారట

Nora Fatehi says she was told to date ‘specific actors’ for PR. నోరా ఫతేహీ.. అద్భుతమైన డ్యాన్సర్. 2018లో దిల్బర్ అనే పాటతో నోరా ఫతేహి

By Medi Samrat  Published on  1 Aug 2023 7:00 PM IST
నోరా ఫతేహికి అలాంటి సలహా ఇచ్చారట

Nora Fatehi 

నోరా ఫతేహీ.. అద్భుతమైన డ్యాన్సర్. 2018లో దిల్బర్ అనే పాటతో నోరా ఫతేహి బాలీవుడ్ లో టాప్ స్టార్ అయింది. అంతకు ముందు ఆమె తెలుగులో కూడా పలు పాటల్లో డ్యాన్స్ చేసింది. అయితే ఆమెకు దిల్బర్ పాటతోనే బాగా గుర్తింపు లభించింది. ఆమె బాలీవుడ్ పరిశ్రమలోని చీకటి కోణాన్ని తెరపైకి తెచ్చింది. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన సమయంలో నోరాకు చాలా మంది సలహాలు ఇచ్చారని.. పబ్లిసిటీ కోసం కొందరు నటీనటులతో డేటింగ్ చేయాలని తనకు చెప్పారని తెలిపింది.

తను సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయిన కొత్తలో స్టార్ హీరోలను డేట్ చేసి, ఎప్పుడూ వారి వెంటే ఉంటూ వార్తల్లో నిలిస్తే ఆఫర్లు వాటంతట అవే వస్తాయని తనకు తన పీఆర్‌లు సలహా ఇచ్చారని నోరా తెలిపింది. అలాంటి సలహాలను పట్టించుకోకుండా తాను ఈ స్థాయిలో ఉన్నానని, దాని వల్ల తన గురించి తాను చాలా గర్వపడుతున్నానని చెప్పింది. జూమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నోరా ఈ వ్యాఖ్యలు చేసింది. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరీ జంటగా నటిస్తున్న మట్కాకు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Next Story