ఎంతో దారుణమైన లిరిక్స్.. సినిమాకు మైనస్

నోరా ఫతేహి, సంజయ్ దత్ ల పాట "సర్కే చునార్" పై నిషేధం విధించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఉంది.

By -  Medi Samrat
Published on : 17 March 2026 2:20 PM IST

ఎంతో దారుణమైన లిరిక్స్.. సినిమాకు మైనస్

నోరా ఫతేహి, సంజయ్ దత్ ల పాట "సర్కే చునార్" పై నిషేధం విధించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఉంది. అసభ్యకరమైన లిరిక్స్ కారణంగా వివాదం తలెత్తింది. కన్నడ పాన్-ఇండియా చిత్రం 'కెడి: ది డెవిల్' (KD: The Devil) లోని "సర్కే చునార్ తేరి సర్కే" పాటను వెంటనే నిషేధించాలని కోరుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కు ఫిర్యాదు అందింది. ఈ పాటలో ప్రముఖ నటి నోరా ఫతేహి, సీనియర్ నటుడు సంజయ్ దత్ నటించారు. న్యాయవాది వినీత్ జిందాల్ సెన్సార్ బోర్డు (CBFC) తో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఈ అధికారిక ఫిర్యాదును అందజేశారు.

యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఈ పాటలో అత్యంత అసభ్యకరమైన, లైంగికంగా ప్రేరేపించే, ద్వంద్వ అర్థాలు వచ్చే పదాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పాటలోని దృశ్యాలు, సాహిత్యం ముఖ్యంగా చిన్నపిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆరోపించారు. ఇక ఈ పాటపై ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్‌లో ఒక క్రిమినల్ ఫిర్యాదు కూడా నమోదైంది. ప్రేమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి తదితరులు నటిస్తున్నారు. "సర్కే చునార్" పాటను హిందీతో పాటు కన్నడ తదితర భాషల్లో కూడా విడుదల చేశారు.

Next Story