నో హనీమూన్..
No honeymoon for Ranbir Kapoor, Alia Bhatt now. అలియా భట్ - రణబీర్ కపూర్ ఒకటి కావడంతో, అభిమానులు వారి హనీమూన్ ప్లాన్‌ల గురించి
By Medi Samrat Published on 16 April 2022 3:59 PM IST
అలియా భట్ - రణబీర్ కపూర్ ఒకటి కావడంతో, అభిమానులు వారి హనీమూన్ ప్లాన్‌ల గురించి అప్‌డేట్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త జంట తమ హనీమూన్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం, అలియా- రణబీర్ హనీమూన్ ఇప్పట్లో లేదని తెలుస్తోంది. ఎందుకంటే వారి బిజీ షెడ్యూల్స్ కారణంగానే..! పలు సినిమాలకు డేట్స్ ఇచ్చిన కారణంగా హనీమూన్ ఇప్పట్లో లేదని అంటున్నారు.
రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14 న వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.ఇంకా వస్తూనే ఉన్నాయి. రణబీర్ యానిమల్ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఆలియా రణవీర్ సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ షూటింగ్‌ను ప్రారంభించనుంది. అందుకే ఈ జంటకు ప్రస్తుతం హనీమూన్ ఉండదు. ఈ జంట తమ హనీమూన్‌కు ఆలస్యంగా వెళ్లనున్నారు.
ఏప్రిల్ 21 నుండి మనాలిలో రణబీర్ యానిమల్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక రణ్‌బీర్- అలియా దక్షిణాఫ్రికాలో హనీమూన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విదేశాలలో నూతన సంవత్సరాన్ని జరుపుకున్న తర్వాత, ఈ జంట మళ్లీ ఆఫ్రికాలో సఫారీకి వెళ్లాలని ప్లాన్ చేసారు. రణబీర్ మరియు అలియా న్యూ ఇయర్ 2022 ను దక్షిణాఫ్రికాలో కలిసి ఎంజాయ్ చేశారు.