ఓటీటీలోకి వచ్చేస్తున్న ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్

నితిన్-శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయింది.

By Medi Samrat  Published on  5 Jan 2024 8:47 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్

నితిన్-శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయింది. తాజాగా ఈ సినిమా OTT స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. జనవరి 12 నుంచి అన్ని భాషల్లో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం.. హాయ్ నాన్న సినిమాతో పోటీ కారణంగా ఈ సినిమా నితిన్‌ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సంక్రాంతి నుండి OTTలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని అంటున్నారు. నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ డిజిటల్ హక్కులను OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాబట్టి సంక్రాంతి వారంలో నితిన్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కావడం ఖాయమని అంటున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నితిన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు తప్ప కథలో బలం లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. శ్రీ లీల గ్లామర్ కూడా సినిమాకు పెద్దగా పని చేయలేదు. ఇక సీనియర్ హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో కనిపించాడు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించారు.

Next Story