ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన‌ నిత్యా మీనన్ 'కుమారి శ్రీమతి'

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కావాల్సిన కంటెంట్ వస్తోంది. థియేటర్లలో సినిమాలు లేకపోతే..

By Medi Samrat  Published on  16 Sep 2023 3:00 PM GMT
ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన‌ నిత్యా మీనన్ కుమారి శ్రీమతి

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కావాల్సిన కంటెంట్ వస్తోంది. థియేటర్లలో సినిమాలు లేకపోతే.. తెలుగు సినీ ప్రేక్షకులు OTT ప్లాట్‌ఫారమ్‌లను నమ్ముకుంటూ ఉన్నారు. కొన్ని సినిమాలు థియేటర్ రన్ పూర్తీ చేసుకుని ఓటీటీలోకి వస్తూ ఉండగా.. ఇంకొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవుతున్నాయి. తాజాగా ఆ లిస్టులో నిత్యా మీనన్ వెబ్ సిరీస్ కూడా చేరింది. ఆమె కొత్త వెంచర్ 'కుమారి శ్రీమతి'.. అందరినీ అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇది నేరుగా OTTలో విడుదల అవుతుంది.

నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఓటీటీ ప్రాజెక్ట్ 'కుమారి శ్రీమతి'. దీనికి శ్రీనివాస్ అవసరాల రైటర్ అండ్ క్రియేటర్ గా బాధ్యతలు చేపట్టారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్ రూపొందించారు. వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ ఇది. దీనికి గోమటేష్ ఉపాధ్యాయు దర్శకత్వం వహించారు. 'కుమారి శ్రీమతి' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే, మోషన్ పోస్టర్ కూడా! పల్లెటూరి నేపథ్యంలో కథతో 'కుమారి శ్రీమతి' రూపొందుతోందని అర్థం అవుతుంది. అమ్మాయి పేరు శ్రీమతి. ఆమెకు పెళ్లి కాలేదు కనుక... 'కుమారి శ్రీమతి' అని చెబుతున్నారు. నిత్యా మీనన్ నటిగా మంచి ఇమేజ్‌ని కలిగి ఉంది. ఆమె కథానాయికగా చేయడంతో ఈ సిరీస్ తదుపరి స్థాయికి చేరుకోనుంది.

Next Story