'కార్తికేయ 2'కు నేషనల్ అవార్డు.. హీరో నిఖిల్ రియాక్షన్ ఇదే.!
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన కార్తికేయ 2, చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం
By Medi Samrat Published on 16 Aug 2024 9:00 PM ISTనిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన కార్తికేయ 2, చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం. కార్తికేయ (2014)కి సీక్వెల్, దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు లభించింది.
ఈ సినిమా విడుదలైన తర్వాత సానుకూల సమీక్షలను అందుకుంది. తెలుగు వెర్షన్‌లోనే కాకుండా హిందీలో కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా రికార్డ్ వ్యూస్ ను అందుకుంది.ఈ సినిమాకు భారత ప్రభుత్వం 70వ జాతీయ అవార్డులలో ‘తెలుగులో ఉత్తమ చిత్రం’ గా సత్కరించింది. ఇది తెలుగు సినిమాకి, ముఖ్యంగా దర్శకుడు చందూ మొండేటి విజయం. నిఖిల్ హీరోగా 2014లో వచ్చిన కార్తికేయ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దానికి సీక్వెల్ గా 2022లో వచ్చిన కార్తికేయ-2 చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి గురించి చెప్పే సన్నివేశానికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
ఈ సినిమా జాతీయ అవార్డు రావడంపై హీరో నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. నమస్తే అండి. నేను మీ నిఖిల్. ఇప్పుడే నేనొక అద్బుతమైన న్యూస్ విన్నాను. మన సినిమా కార్తికేయ-2 నేషనల్ అవార్డు గెలుచుకుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి ఈ అవార్డు రావడం కారణం మా ఎంటైర్ టీం. నిర్మాత అభిషేక్ అగర్వాల్, కృష్ణ ప్రసాద్, వివేక్ గారు.. అలాగే మై బ్రదర్, డైరెక్టర్ చందూ మొండేటి, మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ.. అదే విధంగా మా డీవోబీ కార్తీక్ ఘట్టమనేకి అందరికి థ్యాంక్స్ చెప్పాలి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లకు అందరు చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన మా సినిమాకు ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ ఆడియన్స్‌కి ధన్యవాదాలు. అలాగే మా సినిమాను నేషనల్ అవార్డుకు ఎన్నిక చేసిన కౌన్సిల్‌కి కూడా థ్యాంక్యూ అని వీడియోలో చెప్పుకొచ్చాడు.