ఆ చీర ప్ర‌త్యేక‌త‌ను చెప్పిన నిహారిక‌

Niharika Wear Her Mother Saree. డిసెంబర్ 9న మెగాడాట‌ర్‌ నిహారిక, చైతన్యలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్న విష‌యం

By Medi Samrat  Published on  7 Dec 2020 9:37 AM IST
ఆ చీర ప్ర‌త్యేక‌త‌ను చెప్పిన నిహారిక‌

డిసెంబర్ 9న మెగాడాట‌ర్‌ నిహారిక, చైతన్యలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్న విష‌యం తెలిసిందే. అయితే పెళ్లికి వారం రోజుల ముందుగానే సంబరాలు మొదలయ్యాయి. మెగా ఇళ్లంతా సందడి సందడిగా మారింది. ఇదిలావుంటే.. నిహారిక తన పెళ్లి కూతురు చీర గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట‌ వైరల్ అవుతుంది.

32 ఏళ్ల నాటి అమ్మ చీర కట్టుకుని మురిసిపోయింది నిహారిక. అప్పుడెప్పుడో తండ్రి నాగబాబుతో నిశ్చితార్థం అయినపుడు తన తల్లి పద్మజ కొణిదెల కట్టుకున్న చీరను.. ఇప్పుడు తన పెళ్లి కోసం కట్టుకుంది నిహారిక. దీనికి సంబంధించిన ఫోటోను నిహారిక సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. నిహారిక నీలి రంగు, బంగారు అంచు కలిగిన చీరలో ముస్తాబై.. మా అమ్మ నిశ్చితార్థం చీర.. 32 ఏళ్ల క్రితంది అంటూ విష‌యాన్ని తెలియ‌జేసింది.



ఇదిలావుంటే.. నిహారిక పెళ్ళి వేడుకలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే మెగా హీరోలు అల్లు అర్జున్, చరణ్, ధరమ్ తేజ్ నిహారిక పెళ్లి వేడుకలో సందడి చేయనున్నారు.


Next Story