నిహారిక వెడ్డింగ్ కార్డ్ చూశారా..!
Niharika Konidela Wedding Card. మెగా డాటర్, నటి నిహారిక కొణిదేల వివాహానికి ఏర్పాట్లు చకచకా జరిపోతున్నాయి.
By Medi Samrat Published on 2 Dec 2020 3:00 PM ISTమెగా డాటర్, నటి నిహారిక కొణిదేల వివాహానికి ఏర్పాట్లు చకచకా జరిపోతున్నాయి. డిసెంబర్ 9న నిహారిక వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇందుకు రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ వేదిక కానుంది. నిహారిక పెళ్ళికి సంబంధించిన శుభలేఖను మెగా ఫ్యామిలీ అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్‌లో నిహారిక, వెంకట చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబసభ్యులు ప్లాన్ చేశారు. ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో నిహారిక, చైతన్యల వివాహం జరగనుంది. తండ్రి నాగబాబు, సోదరుడు వరుణ్ తేజ్ సహా కుటుంబపెద్దలు నిహారిక వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిహారిక వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్లాన్ చేశారు. రాజుల కాలం నాటి సంస్కృతి తలపించేలా, ఏనుగులు, రాజ ప్రసాదాల డిజైన్ కలిగిన వెడ్డింగ్ కార్డు, లాక్ తో కూడిన ప్రత్యేకమైన బాక్స్ తో ఏర్పాటు చేశారు. బాక్స్ లో వెడ్డింగ్ కార్డుతో పాటు ఖరీదైన స్వీట్స్ కూడా ఉంచారు. ఇంకెందుకు ఆలస్యం నిహారిక వెడ్డింగ్ కార్డ్ ఎలా ఉందో మీరూ ఓ సారి లుక్కేయండి.