ఘనంగా నిహారిక - చైతన్యల కళ్యాణం
Niharika Chaitanya Wedding. మెగా డాటర్ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ చైతన్య జొన్నలగడ్
By Medi Samrat Published on 10 Dec 2020 10:21 AM ISTమెగా డాటర్ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ చైతన్య జొన్నలగడ్డ నిహారిక మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు వేశారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో గల ఉదయ్ విలాస్‌లో పూలు, తోరణాలతో అందంగా అలంకరించిన మండపంలో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ముహూర్తం వేళ పెళ్లి కుమార్తె నిహారిక బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు వధూవరులను ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. వారి జీవితం సంతోషం, ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్‌లు చేశారు.
Serious nostalgia hit me all again!
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 9, 2020
It feels like the first day of her school, just that she wont be returning by evening.
It took years to make peace with the fact that my baby girl is all grown up to go to school.
Just donno how long it will be this time
Only time will decide. pic.twitter.com/8sjwxJkzaM
ఈ సందర్భంగా నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. 'నా కుమార్తె తొలి రోజు పాఠశాలకు వెళ్తున్నట్లు అనిపిస్తోంది.. కానీ ఆమె సాయంత్రం తిరిగి ఇంటికి రాదు. నా చిన్నారి ఎదిగి, పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆమెతో రోజులో 24 గంటలు ఆడుకోలేనని నా మనసుకు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సారి (పెళ్లి చేయడాన్ని ఉద్దేశిస్తూ) ఎంత కాలం పడుతుందో చూడాలి. దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా నిహారిక తల్లి' అంటూ నాగబాబు పెళ్లి ఫొటో షేర్ చేశారు.