సోష‌ల్ మీడియాలో వేధింపులు.. పోలీసుల‌ను ఆశ్ర‌యించిన హీరోయిన్‌

తనను చంపుతానని బెదిరించిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌పై నటి నిధి అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on  9 Jan 2025 8:30 PM IST
సోష‌ల్ మీడియాలో వేధింపులు.. పోలీసుల‌ను ఆశ్ర‌యించిన హీరోయిన్‌

తనను చంపుతానని బెదిరించిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌పై నటి నిధి అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా చంపేస్తానని బెదిరించినట్లు నిధి అగర్వాల్ తెలిపారు. తన కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడని కూడా ఆమె పోలీసులకు తెలిపింది. వెంటనే విచారణ ప్రారంభించి, సదరు యూజర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

తనను చంపేస్తానంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ కూడా పెడుతున్నాడని ఫిర్యాదులో నిధి తెలిపారు. తనకు ఇష్టమైన వారిని కూడా లక్ష్యంగా చేసుకుని, బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా నిధి అగర్వాల్‌ ప్రస్తావించారు. సదరు సోషల్ మీడియా వినియోదారు లక్ష్యం, వివరాలు తెలియలేదు.ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం నిధి హరి హర వీర మల్లు, రాజా సాబ్ సినిమాల్లో నటిస్తోంది.

Next Story