రికార్డులు సృష్టిస్తున్న పఠాన్ టీజర్

netizens react to Shah Rukh Khan’s comeback movie. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ కొత్త చిత్రం పఠాన్‌. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రం

By Medi Samrat  Published on  6 Nov 2022 7:30 PM IST
రికార్డులు సృష్టిస్తున్న పఠాన్ టీజర్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ కొత్త చిత్రం పఠాన్‌. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ కానుంది. ఇటీవలే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా పఠాన్‌ టీజర్ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లో అత్యధిక మంది వీక్షించిన, లైక్‌ చేసిన రికార్డు క్రియేట్‌ చేసింది. టీజర్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా యష్‌రాజ్‌ ఫిలింస్‌లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్‌ అబ్రహం కీలకపాత్రలో నటించాడు.

నాలుగు సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం పఠాన్. షారుఖ్ ఖాన్ చివరిగా 2018 జీరోలో కనిపించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముంబై, స్పెయిన్, దుబాయ్‌తో సహా పలు లొకేషన్లలో చిత్రీకరించబడింది.



Next Story