అలాంటి క్యారెక్టర్ చేస్తానని అసలు అనుకోలేదు: నేహా శర్మ

చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నేహా శర్మ. ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇతర భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.

By Medi Samrat  Published on  13 July 2024 4:15 PM GMT
అలాంటి క్యారెక్టర్ చేస్తానని అసలు అనుకోలేదు: నేహా శర్మ

చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నేహా శర్మ. ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇతర భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. కొత్త క్రైమ్ థ్రిల్లర్ '36 డేస్'లో ఫరా పాత్రను పోషించింది నేహా శర్మ. ఈ సినిమాలో ఆమె కాస్త విలనిజం ఉన్న పాత్రలో నటించింది. అయితే తన కెరీర్ లో అలాంటి గ్రే క్యారెక్టర్ లో నటిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. అందుకే '36 డేస్' కోసం మేకర్స్ నన్ను సంప్రదించినప్పుడు, నేను నిజంగానే థ్రిల్ అయ్యానని తెలిపింది. నేను ఇందులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉన్నానని నేహా తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ గురించి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించారు. BBC స్టూడియోస్ ఇండియాతో కలిసి అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ దీన్ని నిర్మించింది, '36 డేస్' అనేది UK షో '35 డేస్' భారతీయ అనుసరణ. ఈ షోలో రిషిగా పురబ్ కోహ్లీ, రాధికగా శృతి సేథ్, టోనీగా చందన్ రాయ్ సన్యాల్, లలితగా అమృతా ఖాన్విల్కర్, వినోద్‌గా షరీబ్ హష్మీ, తారాగా సుశాంత్ దివ్‌గిక్‌లు నటించారు.

Next Story