బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?
NBK108 Is Titled Bhagavath Kesari I Don’t Care. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనీల్ రావిపూడితో యాక్షన్ సినిమా చేస్తున్నాడు.
By Medi Samrat Published on 30 May 2023 5:33 PM IST
NBK108 Is Titled Bhagavath Kesari I Don’t Care
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనీల్ రావిపూడితో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చేసింది. అఖండ, వీరసింహా రెడ్డి వంటి వరుస విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. దసరాకు రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకు 'భగవత్ కేసరి' అనే టైటిల్ ఫిక్సయినట్లు సమాచారం. ఐ డోంట్ కేర్ అనేది ఉపశీర్షిక. ఇప్పటికే ఈ పేరును చిత్రబృందం రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తుంది. బాలయ్య బర్త్‌డే సందర్భంగా జూన్ 10న టైటిల్‌ను రివీల్ చేయనున్నారు. శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కూతురుగా కనిపించనుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమా అంటే టైటిల్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి. దీంతో ఈ సినిమాకు 'భగవత్ కేసరి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు. ఆ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తోనే ఈ సినిమా నడుస్తుందని.. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ ఉండనున్నాయి.