నిజం బయట పెట్టిన పనిమనిషి.. ఆ నటుడిని ఇరికించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా..?

Nawazuddin Siddiqui's househelp apologises to him. నవాజుద్దీన్‌పై తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని సప్నా పేర్కొంది

By M.S.R  Published on  22 Feb 2023 8:45 PM IST
నిజం బయట పెట్టిన పనిమనిషి.. ఆ నటుడిని ఇరికించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా..?

బాలీవుడ్ నటుడి కారణంగా తాను దుబాయ్‌లో ఇరుక్కుపోయానని నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంటి సహాయకురాలు సప్నా రాబిన్ మాసిహ్ ఇటీవల ఆరోపించింది. వీసా ఖర్చుల కారణంగా తనకు వేతనాలు చెల్లించడం లేదని ఆమె ఆరోపించింది. తాజాగా నవాజుద్దీన్‌పై తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని సప్నా పేర్కొంది. కొత్త వీడియోలో, సప్నా మొదటి వీడియోను కొందరి ఒత్తిడి కారణంగా పోస్ట్ చేశానని చెప్పింది. ఆమె నవాజుద్దీన్ కు క్షమాపణలు కూడా చెప్పింది. నవాజ్ భార్య ఆలియా సిద్ధిఖీ దాఖలు చేసిన కేసు కూడా అబద్ధమని పేర్కొంది. నేను మీకు కీడు చేయాలని అనుకోలేదు.. మీరు చాలా మంచి వాళ్లు అంటూ నవాజుద్దీన్ గురించి సప్నా చెప్పుకొచ్చింది. ఇంతకు ముందు నేను చేసిన పోస్ట్ కారణంగా మిమ్మల్ని నేను క్షమాపణలు కోరుకుంటూ ఉన్నానని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇటీవలి కాలంలో సినిమాల పరంగా కాకుండా ఇతర విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. దుబాయ్‌లో నవాజుద్దీన్ ఇంటిలో అతని పిల్లలను చూసుకునేందుకు సప్నా అనే అమ్మాయిని నవంబర్‌లో 2022లో నియమించుకున్నారు. నవాజుద్దీన్ భార్య ఆలియా, అతని పిల్లలు షోరా, యాని 2021లో దుబాయ్‌కి వెళ్లారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఆలియా భారతదేశానికి తిరిగి వచ్చారు. అంధేరి బంగ్లాలో ఉంటున్నారు. మరోవైపు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్య ఆలియాతో న్యాయపోరాటం చేస్తున్నారు.


Next Story