ట్రాక్టర్ నడిపిన అమితాబ్ బచ్చన్ మనవరాలు.. వీడియో వైర‌ల్‌.!

Navya Nanda drives tractor during Gujarat trip. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పర్సనాలిటీ.

By Medi Samrat
Published on : 20 May 2023 1:25 PM IST

ట్రాక్టర్ నడిపిన అమితాబ్ బచ్చన్ మనవరాలు.. వీడియో వైర‌ల్‌.!

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పర్సనాలిటీ. ఆమె బిగ్ బి, మిగిలిన బచ్చన్ కుటుంబం వలె నటి కాదు. వ్యాపారంలో రాణిస్తుంది. నవ్య.. ఆరా హెల్త్ అనే మహిళా కేంద్ర ఆరోగ్య సంస్థకు సహ వ్యవస్థాపకురాలు. తన వ్యాపారం, ఫోటోషూట్‌లకు సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నవ్య.. తాజాగా ట్రాక్టర్ నడుపుతున్న వీడియోను షేర్ చేసింది. విలాసవంతమైన జీవితాన్ని గడిపే వీలున్న‌ నవ్య.. స్థానిక ప్రజలతో ఎంతో ప్రేమగా, తీరికగా గడుపుతుందని అభిమానులు కొనియాడుతున్నారు.

నవ్య ఇటీవల గుజరాత్‌లోని ఓ గ్రామంలో ప‌ర్య‌టించింది. అక్కడ ఆమె స్థానిక ప్రజలను కలిశారు. ఊర్లో చెట్టుకింద కూర్చుని గ్రామ‌స్తుల‌తో చాలాసేపు మాట్లాడి సరదాగా గడిపింది. అనంత‌రం నవ్య ట్రాక్టర్ కూడా నడిపింది. బిగ్ బి మనవరాలి అయినప్పటికీ సామాన్యుల మధ్య సింపుల్ గా గడిపే నవ్య తీరు చూసి అభిమానులు చాలా సంతోషించారు. కొందరు ఆమె వినయంగా ఉంటున్న‌ స్వభావాన్ని కొనియాడగా.. కొందరు ఆమె డ్రైవింగ్ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్య‌క్తం చేశారు. నవ్య వీడియోపై 'మీరు ప్రజలతో మమేక‌మైన‌ తీరు అభినందనీయం' అని ఓ నెటిజ‌న్ రాయ‌గా.. మరొక వినియోగదారు.. 'మీరు చాలా భిన్నమైన స్టార్ కిడ్' అని వ్యాఖ్యానించారు. నవ్య నవేలి అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బ‌చ్చ‌న్‌-నిఖిల్ నందాల కుమార్తె.


Next Story