అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారు : నవదీప్

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ శ‌నివారం విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. విచార‌ణ అనంత‌రం న‌వ‌దీప్ మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  23 Sep 2023 3:23 PM GMT
అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారు : నవదీప్

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ శ‌నివారం విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. విచార‌ణ అనంత‌రం న‌వ‌దీప్ మాట్లాడుతూ.. నాకు నోటీసులు ఇచ్చినందుకు నేను హాజరయ్యానని తెలిపారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీతా రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తుందని అన్నారు. రామ్‌చంద్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్నమాట వాస్తవమేన‌ని.. నేను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు.. కన్‌స్యూమ్‌ చేయలేదని తెలిపారు. గతంలో ఒక పబ్ ను నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారని పేర్కొన్నారు. గతంలో సిట్, ఈడీ విచారించింది.. ఇప్పుడు టీఎస్ ఎన్ఏబీ(TSNAB) విచారిస్తుందని తెలిపారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారని పేర్కొన్నారు.

యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను విచారించామని తెలిపారు. నవదీప్ ను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడని పేర్కొన్నారు. ఇప్పుడు తాను ఎలాంటి డ్రగ్స్ వాడడం లేదని చెప్తున్నాడు. తన స్నేహితుడు రామ్ చంద్ తో కలిసి గతంలో పబ్ BPM నిర్వహించినట్టు నవదీప్ చెప్పాడు. BPM OAB కొన్ని నెలల క్రితం క్లోజ్ అయిందని వెల్ల‌డించాడని పేర్కొన్నారు. నవదీప్ ఫోన్‌లో ఉన్న డాటా మొత్తం డిలీట్ చేశాడని తెలిపారు. నవదీప్ ఫోన్ రీట్రైవ్ చేసి మళ్లీ విచారిస్తాం.. డేటా అంత స్వాధీనం చేసుకున్నాక మళ్లీ నవదీప్ ని పిలిచి విచారిస్తామన్నారు.

Next Story