వీల్‌ఛైర్‌లో ఎయిర్‌పోర్టులోకి నేషనల్ క్రష్..త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్

By Knakam Karthik  Published on  22 Jan 2025 11:55 AM IST
telugu news, Tollywood, entertainment, rashmika mandanna

వీల్‌ఛైర్‌లో ఎయిర్‌పోర్టులోకి నేషనల్ క్రష్..త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్

ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా పుష్ప-2 మూవీతో ఆడియెన్స్‌ను మెప్పించిన ఆ భామ ప్రస్తుతం చేతి నిండా మూవీలో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే రీసెంట్‌గా ఈ బ్యూటీకి కాలిక ఇంజ్యూరీ అయిన విషయం మూవీ ఇండస్ట్రీలో పెద్దకు చర్చకు దారి తీసింది. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న సమయలో కాలు బెనికింది,. గాయం నుంచి కోలుకునేందుకు నెలల సమయం కూడా పట్టొచ్చేమో అని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

లేటెస్ట్‌గా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రష్మిక మందన్నా వీల్ ఛైర్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనడం కోసం ముంబై బయలుదేరినట్లు టాక్ వినిపిస్తోంది. కారులో విమానాశ్రయానికి చేరుకున్న రష్మిక.. తన టీమ్ హెల్ప్‌తో వీల్‌ఛైర్‌లో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లారు. అయితే ఈ భామ తన ఫేస్ కనిపించకుండా క్యాప్ అండ్ మాస్క్‌తో కవర్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని, నిన్ను ఈ సిట్యూవేషన్‌లో చూడలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వీడియో చూసిన రష్మిక ఫ్యాన్స్ ఆమె త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

తనకు గాయమైనట్లు తెలుపుతూ ఇటీవల రష్మిక ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్‌’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యాన్ని క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్‌ అయినా వెంటనే షూట్‌లో భాగం అవుతా’’ అని దానిలో తెలిపారు.

Next Story