మరిన్ని చిక్కుల్లో మన్సూర్ అలీ ఖాన్

'లియో' సినిమాలో హీరోయిన్‌ త్రిష ను రేప్‌ చేసే సీన్‌ లేకపోవడంతో బాధపడ్డానని నటుడు మన్సూర్‌ అలీఖాన్‌

By Medi Samrat  Published on  20 Nov 2023 6:57 PM IST
మరిన్ని చిక్కుల్లో మన్సూర్ అలీ ఖాన్

'లియో' సినిమాలో హీరోయిన్‌ త్రిష ను రేప్‌ చేసే సీన్‌ లేకపోవడంతో బాధపడ్డానని నటుడు మన్సూర్‌ అలీఖాన్‌చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు. అలీఖాన్‌ వ్యాఖ్యలు అతడి నీచపు సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘త్రిష కృష్ణన్‌ను ఉద్దేశించి మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అతడిపై ఐపీసీ సెక్షన్‌ 509బీతోపాటు ఇతర సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదు’’ అని ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్‌ చేసింది.

తమిళ్‌ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా నటించిన 'లియో' సినిమా అక్టోబ‌ర్ 19న విడుద‌లైంది. ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ త‌దిత‌రులు కీలక పాత్రలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. హీరోయిన్‌ త్రిష‌పై అసభ్యకరమైన వ్యాఖ్య‌లు చేశాడు. లియో సినిమాలో త్రిష నటిస్తున్నారని తనకు తెలిసిందని, తాను కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో త్రిష‌తో తాను చేసే సీన్లలో ఒక్క సీన్‌ అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నానన్నారు. తన మునుప‌టి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిష‌ను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నానని, కానీ అలా జ‌రగ‌లేదని.. కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం తనకు చూపించలేదని మన్సూర్‌ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

Next Story