శివ పార్వతి థియేటర్‌తో.. తనకున్న అనుబంధాన్ని పంచుకున్న హీరో నాని

Nani shares his connection with Shiva Parvathi theatre in KPHB. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో మంటలు చెలరేగిన వెంటనే, ప్రమాదంపై ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియాలో తమ విచారాన్ని

By అంజి  Published on  3 Jan 2022 12:20 PM GMT
శివ పార్వతి థియేటర్‌తో.. తనకున్న అనుబంధాన్ని పంచుకున్న హీరో నాని

హైదరాబాద్‌ నగరంలో గల కూకట్‌పల్లిలోని శివపార్వతి థియేటర్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. శివపార్వతి థియేటర్‌తో తనకున్న అనుబంధాన్ని చెప్పారు. ఇవాళ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో మంటలు చెలరేగిన వెంటనే, ప్రమాదంపై ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియాలో తమ విచారాన్ని వ్యక్తం చేశారు. 2002లో మహేష్ బాబు నటించిన 'టక్కరి దొంగ' సినిమాని మొదటి రోజు చూసే మధుర జ్ఞాపకాలు ఉన్నాయని నాని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

"శివపార్వతి థియేటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి వినడం బాధాకరం. అక్కడ టక్కరి దొంగను మొదటి రోజు పిచ్చి ఆనందంతో చూసినట్లు గుర్తు. ఎవరూ గాయపడలేదని తెలుసుకోవడం ఆనందంగా ఉంది" అని హీరో నాని ట్విటర్‌లో రాశారు. సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో శివపార్వతిలోని అలంకరణలు, కుషన్ సీటింగ్‌లు ధ్వంసమయ్యాయి. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని తెలుస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రముఖ సినిమా స్క్రీన్‌లలో ఒకటి, శివ పార్వతి మంచి సౌండ్ సిస్టమ్‌తో పెద్ద స్క్రీన్ థియేటర్‌గా ప్రశంసించబడింది. గతంలో ఈ రంగస్థలం అక్కినేని కుటుంబానికి లక్కీ ఛార్మ్‌గా మారింది.

Next Story
Share it