సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించాల్సిన అవసరం ఉంది : నాని

Nani responds to Pawan Kalyan comments.రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sep 2021 9:28 AM GMT
సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించాల్సిన అవసరం ఉంది : నాని

రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడిన ఆయన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు పెడుతున్న వారిని ఏకిపారేశారు. త‌న ప్ర‌సంగంలో హీరో నానికి మ‌ద్దతుగా మాట్లాడారు. ఈ మధ్య నాని గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగిందన్నారు. త‌నేదో ఓ సినిమా చేసుకున్నాడు. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డితే దానికి త‌నేం చేస్తాడు. నిర్మాతల శ్రేయ‌స్సు కోరి ఓటిటీలో త‌ను న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ ను విడుద‌ల చేశారు. అందుకు నానిని అంటే ఎలా.. ఓ సినిమా ఓటీటీకి వెళ్లిందంటే అందుకు కార‌ణ‌మైన వారిని క‌దా అనాలి అంటూ నానికి మ‌ద్ద‌తుగా ప‌వ‌ర్ స్టార్ మాట్లాడారు.

కాగా.. ఇండ‌స్ట్రీలోని స‌మ‌స్య‌లపై హీరో నాని స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఉన్న రాజ‌కీయ విభేదాలు ప‌క్క‌న‌బెట్టేద్దామ‌న్నారు. సినీ రంగం క్షేమంగా ఉండ‌డ‌మే ముఖ్య‌మ‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేవనెత్తిన సినీ రంగం సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.దీనిపై తక్షణ స్పందన అవసరమని అభిప్రాయపడ్డారు. చిత్ర రంగ ఇబ్బందులను పూర్తిస్థాయిలో ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ఓ స‌భ్యుడిగా సీఎం జ‌గ‌న్ గారికి, సంబంధిత మంత్రుల‌కు నేను చేస్తున్న విజ్ఞ‌ప్తి ఒక‌టేన‌ని.. సినిమా ప‌రిశ్ర‌మ మ‌రింత దెబ్బ‌తిన‌క ముందే స్పందించాల‌ని ప‌రిశ్ర‌మ‌ను కాపాడాల‌ని కోరుతున్నాన‌ని నాని ట్వీట్ చేశారు.

Next Story