అంటే సుందరానికి ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు..!

Nani film Ante Sundaraniki gets OTT release. నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా జూన్ 10వ తేదీన

By Medi Samrat  Published on  4 July 2022 9:34 AM IST
అంటే సుందరానికి ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు..!

నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా జూన్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా నజ్రియా మెయిన్ హీరోయిన్ గా నటించింది. రివ్యూలు మంచిగా వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫ్లాప్ సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే సుందరనికి.. సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

తాజాగా సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. జూలై 10వ తేదీన సినిమా రాబోతున్నట్లుగా పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఓటీటీలో నాని సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు తప్పకుండా కనెక్ట్ అవుతుందని సినిమా యూనిట్ మొదటి నుండి చెబుతున్న సంగతి తెలిసిందే..! ఈ సినిమాలో అళగమ్‌ పెరుమాళ్‌, నదియా, నరేష్‌, రోషిణి, అనుపమ పరమేశ్వరన్‌, పృథ్విరాజ్‌,అరుణ భిక్షు, తన్వి రామ్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెంకటేష్‌ మహా తదితరులు నటించారు.
























Next Story