దసరా కలెక్షన్స్.. నాని సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం

Nani Dasara Movie Collections. నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన 'దసరా' సినిమా మార్చి 30న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది

By M.S.R  Published on  1 April 2023 1:46 PM IST
దసరా కలెక్షన్స్.. నాని సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం

Hero Nani In Dasara Movie


నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన 'దసరా' సినిమా మార్చి 30న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజున భారతదేశంలో రూ. 38 కోట్ల కలెక్షన్స్ ను అందుకుని నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. దసరా సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రివెంజ్ డ్రామాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.

తొలి రోజునే రూ.38 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను వ‌సూలు చేసిన ద‌స‌రా.. రెండో రోజున దాదాపు రూ.15 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అంటే రెండు రోజుల్లో రూ.52.40 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌సరా సినిమా రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నైజాం - రూ.10.26 కోట్లు

సీడెడ్ - రూ. 3.02 కోట్లు

ఉత్త‌రాంధ్ర - రూ. 2.06 కోట్లు

ఈస్ట్ - రూ. 1.18 కోట్లు

వెస్ట్ - రూ. 71 ల‌క్ష‌లు

గుంటూరు - రూ. 1.46 కోట్లు

కృష్ణా - రూ. 92 ల‌క్ష‌లు

నెల్లూరు - రూ. 47 ల‌క్ష‌లు

క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా క‌లిపి రూ.2.15 కోట్లు

మిగిలిన భాష‌ల్లో రూ.65 ల‌క్ష‌లు

నార్త్ ఇండియాలో రూ.60 ల‌క్ష‌లు

ఓవ‌ర్‌సీస్‌లో రూ 5.60 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

ఈ సినిమా రూ.48 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జ‌రుపుకుంది. హిట్ స్టేటస్ రావాలంటే మ‌రో 20 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు ఉన్న పాజిటివ్ టాక్ తో శని, ఆదివారాల్లో ఈజీగా లాభాల బాట పట్టేస్తుందనడంలో సందేహమే లేదు.


Next Story