నాని కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా..

Nani 28th Movie Update. నాచ్యులర్‌ స్టార్ నాని 28వ సినిమా అప్‌‌డేట్‌ వచ్చేసింది. ‘అంటే సుందరానికి...’ అనే టైటిల్‌తో

By Medi Samrat  Published on  21 Nov 2020 8:01 AM GMT
నాని కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా..

నాచ్యులర్‌ స్టార్ నాని 28వ సినిమా అప్‌‌డేట్‌ వచ్చేసింది. 'అంటే సుందరానికి...' అనే టైటిల్‌తో వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ క్రేజీ ఫ్రాజెక్ట్ తెర‌కెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క‌ర్టైన్ రైజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇక‌ ఈ సినిమాలో నాని స‌ర‌స‌న‌ మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తుంది. నజ్రీయా ఇప్పటి వరకు తెలుగులో నటించకపోయినప్పటికీ ఆమెకు తెలుగు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుండ‌టంతో నజ్రీయా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.


ఇక‌ ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొంటుంది. 'బ్రోచేవారేవరురా', 'మెంటల్‌ మదిలో'వంటి హిట్‌ సినిమాలతో అతి తక్కువ కాలంలోనే వివేక్‌ మంచి గుర్తింపును సంపాదించుకున్న వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాతో రచయితగానూ మారాడు. ఈ సినిమాకు నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా.. వివేక్‌ సాగర్ బాణీలు స‌మ‌కూరుస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవి శంకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే.. నాని ప్రస్తుతం టక్‌ జగదీష్‌, శ్యామ్‌ సింగరాయ్ సినిమాల‌లో న‌టిస్తున్నాడు.


Next Story