యాపిల్ స్టోర్ మీద కోపాన్ని బయటపెట్టిన కింగ్

Nagarjuna Serious On Apple Store India. చాలా మంది సెలెబ్రిటీలు యాపిల్ డివైజ్ లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.

By Medi Samrat  Published on  9 Dec 2020 6:51 PM IST
యాపిల్ స్టోర్ మీద కోపాన్ని బయటపెట్టిన కింగ్

చాలా మంది సెలెబ్రిటీలు యాపిల్ డివైజ్ లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఎక్కువ ఖరీదు ఉన్నా కూడా సేఫ్టీ కోసం చాలా మంది ఈ డివైజ్ లకే మొగ్గు చూపుతూ ఉంటారు. తాజాగా యాపిల్ సంస్థపై టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విమర్శలు గుప్పించారు. భారత్ లో ఉన్న యాపిల్ స్టోర్లలో ఆ కంపెనీకి చెందిన బ్రాండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ ద్వారా ఆయన హెచ్చరించారు.



యాపిల్ ఇండియా సర్వీసెస్, పాలసీలు సరిగా లేవని వాళ్లకు అనుకూలంగా క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పారు. వారి పాలసీలు చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించారు. నాగార్జున చేసిన పోస్టుకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ ఆరోపణలపై యాపిల్ సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇంతకూ యాపిల్ మీద నాగార్జునకు అంత కోపం రావడానికి కారణమేమిటా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కామెంట్లు చూస్తే 'మా నాగ్ బాబాయ్ కే కోపం తెప్పించారు కదా' అంటూ నవ్వులు తెప్పించే పోస్టులు పెడుతూ వస్తున్నారు.


Next Story